VTStyles

Recent Post

Sunday, 15 May 2016

Breakfast - Pancake - Tomato Malpuri

టమోటా మాల్‌పురి


బెంగళూరు టమో టాలు-4 మైదాపిండి - ఒక కప్పు బేకింగ్‌ పౌడర్‌- పావు టీ స్పూను పాలు- ఒక టేబుల్‌ స్పూను నెయ్యి- అర కప్పు పచ్చికొబ్బరి కోరు - ఒక కప్పు యాలకులపొడి- కొద్దిగా పంచదార పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు కిస్‌మిస్‌లు బాదంపలుకులు జీడిపప్పు- కొద్దిగా

  • టమోటాలు వేడినీళ్ళలో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత తొక్క తీసి పండుని మిక్సీలో వేసి రుబ్బుకుని గుజ్జు తీసుకోవాలి.

  • ఇందులో మైదాపిండి వేసి బాగా కలపాలి. పాలు, బేకింగ్‌ పౌడర్‌, పంచదార కూడా వేసి పిండిని జారుగా కలపాలి.

  • ఇప్పుడు ఒక నానస్టిక్‌ పెనం పొయ్యి మీద పెట్టి గరిటతో పిండిని దోసెల్లా పోయాలి. దాని మీద నెయ్యి వేసి ఒకవైపు కాలాక తిరగేసి మళ్ళీ నెయ్యి వేసి కాల్చాలి.

  • ఇలా అన్నీ చేసుకున్నాక ప్లేటులో పెట్టి మడతలు వేయాలి. వీటిపైన పచ్చి కొబ్బరి, కిస్‌మిస్‌లు, జీడిపప్పు, బాదంపప్పు, చెర్రీ పెడితే చూడడానికి అందంగా ఉండటమేకాక రుచిగా కూడా ఉంటాయి

No comments:

Post a Comment