VTStyles

Recent Post

Tuesday, 17 May 2016

Bakery - Biscuits - No Bake - Dates/Karjura Chocolate Coins

డేట్‌ చాక్లెట్‌ కాయిన్స్


ఎండు ఖర్జూరాలు- ఒక కప్పు బెల్లం (పొడి చేసినది)- 1టీ స్పూన బ్రెడ్‌ పొడి- 2 టీస్పూన్లు ఎండుకొబ్బరి పొడి- 2 టీస్పూన్లు నెయ్యి- 2 టీ స్పూన్లు చెర్రీస్‌ కిస్‌మిస్‌ ఫ్రూటీ గసాలు - 1 టీ స్పూను జీడిపప్పు పలుకులు - 2 టీ స్పూన్లు క్యాడ్‌బరీ చాక్లెట్‌ తురుము - 2 టీస్పూన్లు

  • ముందుగా ఖర్జూర పండ్లలోని గింజలు తీసేసి, వాటిని పొడి చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

  • ఇందులో బెల్లంపొడి, బ్రెడ్‌పొడి, క్యాడ్‌బరీ తురుము, కిస్‌మిస్‌, జీడిపప్పు పలుకులు, గసాలు, ఫ్రూటీ, నెయ్యి అన్నీ వేసి చేతితో చపాతీ పిండి ముద్దలా బాగా కలపాలి.

  • తరువాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని బిళ్ళలుగా చేతితో వత్తుకోవాలి. ఈ బిళ్ళలకి రెండువైపుల కొబ్బరి పొడి అద్ది, పైన చెర్రీతో అలంకరించి సర్వ్‌ చేయాలి. అంతే చాక్లెట్‌ డేట్‌ కాయిన్స రెడీ.

No comments:

Post a Comment