కట్టె పొంగలి |
చెట్నీ/సాస్ |
బియ్యం - ముప్పావు కప్పు పెసరపప్పు - పావు కప్పు మిరియాల పొడి - టీ స్పూను అల్లం తురుము - టీ స్పూను పచ్చి మిర్చి - 4 జీలకర్ర - టీ స్పూను జీడిపప్పులు - 10 కరివేపాకు - 2 రెమ్మలు నెయ్యి - 5 టీ స్పూన్లు ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత
బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి .పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి.
బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాక, జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి, అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి
చట్నీ, సాంబారులతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment