![]() |
మరి కొన్ని సాంబారు రుచులు |
కావలసిన పదార్థాలు
*కందిపప్పు - పావు కప్పు
* బెల్లం - 3 టేబుల్ స్పూన్లు
* కొత్తిమీర - చిన్న కట్ట
* చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు
* సాంబారు పొడి - టీ స్పూను
* కరివేపాకు - 2 రెమ్మలు
* చిలగడదుంప ముక్కలు - అర కప్పు
* ఉల్లి తరుగు - అర కప్పు
* పచ్చి మిర్చి - 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి)
* మునగకాడ ముక్కలు - కప్పు
* టొమాటో తరుగు - అర కప్పు
* దొండకాయ ముక్కలు - పావు కప్పు
* అరటికాయ ముక్కలు - పావు కప్పు
* తీపి గుమ్మడికాయ ముక్కలు - కప్పు
* సొరకాయ ముక్కలు - అర కప్పు
* సెనగ పిండి - 2 టీ స్పూన్లు
* ఉప్పు - తగినంత
* పసుపు - కొద్దిగా
* కారం - 2 టీ స్పూన్లు
కావలసిన పదార్థాలు
పోపు కోసం...
* ఆవాలు - టీ స్పూను
* జీలకర్ర - టీ స్పూను
* ఎండు మిర్చి - 10
* సెనగ పప్పు - టీ స్పూను
* మినప్పప్పు - టీ స్పూను
* మెంతులు - అర టీ స్పూను
* ఇంగువ - కొద్దిగా
తయారుచేయు విధానం
పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి
ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాక, మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి
సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి
కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి
ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి.
No comments:
Post a Comment