![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పెరుగు - ఒకటిన్నర కప్పు
* ఐసింగ్ షుగర్ - టేబుల్‌స్పూను
* గట్టి మామిడి పండు - ఒకటి పెద్దది
* పుదీనా ఆకులు - అలంకరణకోసం
* యాలకులపొడి - చెంచా
* శ్రీఖండ్ - రెండు చెంచాలు (బజార్లో దొరుకుతుంది).
తయారుచేయు విధానం
పెరుగును పల్చని, మెత్తని వస్త్రంలో తీసుకుని మూటలా చుట్టేయాలి. దీన్ని గట్టిగా పిండినట్లు చేస్తే.. పెరుగులో ఉన్న నీరంతా ఇవతలకు వచ్చేస్తుంది. అది పూర్తిగా గడ్డ పెరుగులా మారుతుంది.
దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ఐసింగ్ షుగర్, యాలకులపొడీ, శ్రీఖండ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు గ్లాసులో సగం వరకూ తీసుకోవాలి.
ఇప్పుడు మామిడిపండు చెక్కు తీసేసి స్కూప్‌తో గుండ్రటి ముక్కల్లా తీసుకోవాలి.. ఇందులో సగం ముక్కల్ని పెరుగు మిశ్రమంపై వేసేయాలి.
తరవాత మిగిలిన పెరుగును మామిడి ముక్కలపై వేయాలి. చివరగా మిగిలిన మామిడి ముక్కల్ని వేసి.. పుదీనా ఆకులు అలంకరిస్తే చాలు.
No comments:
Post a Comment