కివ, మ్యాంగో స్మూతీ |
గడ్డ పెరుగు - కప్పు క్రీం - రెండు చెంచాలు చీజ్ - రెండు చెంచాలు తేనె - రుచికి సరిపడా కివీ - ఒకటి మామిడికాయ - ఒకటి.
పెరుగును పల్చని, మెత్తని వస్త్రంలో తీసుకుని మూటలా చుట్టేయాలి. దీన్ని గట్టిగా పిండినట్లు చేస్తే.. పెరుగులో ఉన్న నీరంతా ఇవతలకు వచ్చేస్తుంది.
అలా పూర్తిగా గడ్డలా మారిన పెరుగును మిక్సీజారులోకి తీసుకోవాలి. ఇందులో తేనె తప్ప మిగిలిన పదార్థాలూ, కివీ, మామిడికాయముక్కలూ వేసుకోవాలి.
తరవాత మిక్సీ పడితే.. స్మూతీ తయారవుతుంది. దీన్ని గ్లాసులోకి తీసుకుని రుచికి సరిపడా తేనె వేసుకుంటే చాలు. స్మూతీ తయారైనట్లే. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. కాస్త చల్లగా అయ్యాక తీసుకోవాలి.
No comments:
Post a Comment