VTStyles

Recent Post

Tuesday, 24 May 2016

Pulav - FoxtailMillet Pulav/ Korra Biyyam Pulav

కొర్రల పులావ్


వండిన కొర్రల అన్నం - పది కప్పులు నూనె నెయ్యి - పావు కప్పు చొప్పున లవంగాలు - మూడు దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు క్యారెట్‌ ముక్కలు - అరకప్పు పచ్చిబఠాణీ - కప్పు పచ్చిమిర్చి - ఐదు ఉప్పు - తగినంత కొబ్బరిపాలు - రెండున్నర కప్పులు అల్లంవెల్లుల్లి ముద్ద - అర చెంచా.

  • బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, పావుచెంచా ఉప్పూ వేసి వేయించుకోవాలి.

  • ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చి వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, క్యారెట్‌ ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి.

  • అప్పుడు కొబ్బరిపాలూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి. ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి.

  • ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు. అయితే మూడు నిమిషాల తరవాత మూత తీసి వడ్డించాలి.

No comments:

Post a Comment