![]() |
మరి కొన్ని పాయసం రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పచ్చి కొర్రలు - రెండున్నర కప్పులు
* బెల్లం - ఐదు కప్పులు
* నీళ్లు - పదిహేను కప్పులు
* నెయ్యి - కప్పు
* జీడిపప్పు - అరకప్పు
* కిస్‌మిస్ - పావుకప్పు
* యాలకులపొడి - పావుచెంచా.
తయారుచేయు విధానం
కొర్రల్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. తరవాత పొయ్యిమీదపెట్టి నీరుపోసి ఉడికించుకోవాలి.
ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయాలి. పది నుంచి పన్నెండు నిమిషాలకు బెల్లం కరిగి.. పాయసం కొద్దిగా చిక్కగా అయి, రంగు మారుతుంది.
అప్పుడు నాలుగు చెంచాల నెయ్యి వేయాలి. పాయసం ఇంకాస్త ఉడికి.. దగ్గరవుతున్నప్పుడు మరో పొయ్యిమీద మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్ పలుకులు వేయించుకోవాలి. తరవాత దీన్ని పాయసంలో వేసి, యాలకులపొడి చేర్చి దింపేయాలి.
No comments:
Post a Comment