కొర్రల పులిహోర |
కొర్రల అన్నం - పది కప్పులు ఆవాలు - పావుచెంచా జీలకర్ర - అరచెంచా సెనగపప్పు - ఒకటిన్నర చెంచా ఎండుమిర్చి - తొమ్మిది పచ్చిమిర్చి - ఆరు కరివేపాకు - రెండు రెబ్బలు నూనె - అరకప్పు పసుపు - పావుచెంచా ఉప్పు - తగినంత జీడిపప్పు పల్లీలు - రెండూ కలిపి పావుకప్పు నిమ్మరసం - పావుకప్పు.
పొడిగా వండిన కొర్ర అన్నాన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, ఎండుమిర్చీ, పల్లీలూ, జీడిపప్పు వేయించుకోవాలి.
అవి వేగాక పసుపూ, కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లగా అయ్యాక కొర్ర అన్నంలో వేసి కలిపితే సరిపోతుంది. కొర్ర పులిహోర సిద్ధం.
No comments:
Post a Comment