VTStyles

Recent Post

Tuesday, 24 May 2016

Daddojanam - FoxtailMillet Tomato Rice/ Korra Biyyam Tomato Annam

టొమాటో రైస్‌


కొర్రల అన్నం - పది కప్పులు (హోటళ్లలో సాంబారు వడ్డించే చిన్న కప్పుతో కొలుచుకోవాలి) నూనె నెయ్యి - పావు కప్పు చొప్పున లవంగాలు - మూడు దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు ఉల్లిపాయముక్కలు - ముప్పావు కప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు - రెండున్నర కప్పులు పచ్చిమిర్చి - నాలుగు ఉప్పు -తగినంత అల్లంవెల్లుల్లి మిశ్రమం ముద్ద - అరచెంచా కారం - చెంచా నీళ్లు - రెండు కప్పులు.

  • బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి.

  • నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, కొంత ఉప్పూ, కారం వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని వేయించాలి.

  • అందులో టొమాటో ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి.అప్పుడు నీళ్లూ, మిగిలిన ఉప్పు చేర్చి మంట తగ్గించాలి.

  • అవి ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండునిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

No comments:

Post a Comment