![]() |
మరి కొన్ని రసగుల్లా రుచులు |
మరి కొన్ని జామూన్ రుచులు |
కావలసిన పదార్థాలు
* పాలు- ఏడు కప్పులు
* నీళ్లు- మూడు కప్పులు
* యాలకలు- నాలుగు
* బాదం
* పిస్తా పప్పు
* నిమ్మరసం- రెండు టీస్పూన్ల చొప్పున
* చక్కెర- తగినంత.
తయారుచేయు విధానం
నాలుగు కప్పుల పాలల్లో నిమ్మరసం వేసి మరిగించాలి. అది గడ్డలు కట్టాక దాన్ని పలుచటి వస్త్రంలోకి వడకట్టి దాన్ని రెండు సెకన్లు వాటర్ టాప్ కింద పెట్టి దానిలోని నీరంతా పోయే వరకు పిండాలి. వస్త్రంలోని మిశ్రమంతో ఉండలు చేయాలి.
వరకు పిండాలి. వస్త్రంలోని మిశ్రమంతో ఉండలు చేయాలి. ప్రెషర్ కుక్కర్‌లో మూడు కప్పుల నీళ్లు, ఒక కప్పు చక్కెర వేసి మరిగించి దానిలో ఉండలు వేసి రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆపేయాలి.
మిగిలిన పాలను మరొక గిన్నెలో చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. దానిలో కొద్దిగా చక్కెర, యాలకలు, పిస్తా, బాదం వేయాలి. కుక్కర్‌లోని ఉండలు చల్లారక నీళ్లు పోయేలా చిన్నగా వత్తి చల్లారిన పాలల్లో వేయాలి. అంతే.. నోరూరించే రసమలై రెడీ...దీన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి తింటే ఆ టేస్టే వేరు..
No comments:
Post a Comment