షుగర్ డోనట్ |
మైదా - కప్పు చక్కెర - రెండు చెంచాలు ఉప్పు కలపని వెన్న - మూడు చెంచాలు తాజా ఈస్ట్ - చెంచా గుడ్డు - ఒకటి పాలు - రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు - చిటికెడు ఐసింగ్ షుగర్ - అరకప్పు నూనె - వేయించేందుకు సరిపడా.
మైదాను జల్లించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చక్కెరా, ఉప్పూ, ఈస్ట్ వేసి కలపాలి. తరవాత పాలూ, గుడ్డుసొన వేసి మరీ మెత్తగా, అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి.
తరవాత కరిగించిన వెన్న వేయలి. దీనిపై తడి వస్త్రాన్ని కప్పి అరగంటసేపు గది ఉష్ణోగ్రతలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇది పొంగుతుంది. తరవాత మరోసారి ఇంకో అరగంట నాననివ్వాలి.
నానాక మందంగా చపాతీలా వత్తి, గుండ్రంగా, బాదుషా ఆకారంలో వచ్చేలా చేసుకోవాలి. తరవాత వీటిని రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిపై ఐసింగ్ షుగర్ అద్దితే సరిపోతుంది.
No comments:
Post a Comment