చిలకడదుంప పాన్ కేక్ |
మైదా- 1 కప్పు గోధుమ పిండి- 1/4 కప్పు ఉడికించి చిదుముకున్న చిలకడ దుంపలు- 1 కప్పు పంచదార- 1/2 కప్పు తేనె- 2 టేబుల్ స్పూన్లు పాలు- 1 కప్పు గుడ్లు- 2 దాల్చినచెక్క పొడి- 1/2 టీస్పూను బేకింగ్ పౌడర్- 1 టీస్పూను వెన్న- 3 టేబుల్ స్పూన్లు నూనె- సరిపడా.
మైదా, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్‌లను ఒక గిన్నెలో వేసి పాలుపోస్తూ జారుగా కలుపుకోవాలి.
తరువాత గుడ్లు కూడా కొట్టి పోసి, చిలకడ దుంప గుజ్జు, వెన్న, తేనె, దాల్చినచెక్క పొడి, పంచదార చేర్చి బాగా గిలకొట్టుకోవాలి.
పెనం వేడిచేసి ఒకటిన్నర టీస్పూను నూనె వేసి పెనం మొత్తం వ్యాపించేలా అటూ ఇటూ కదపాలి.
తయారు చేసుకున్న పిండిని రొట్టెలా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకవైపు ఉడికిన తరువాత మరో వైపు తిప్పి ఉడికించాలి.
వెజిటేరియన్ వాళ్లు గుడ్లు వాడకుండా కూడా కూడా చేసుకోవచ్చు.
No comments:
Post a Comment