![]() |
మరి కొన్ని పిజ్జా రుచులు |
కావలసిన పదార్థాలు
*పిజ్జా బేస్ (ఇది బేకరీలలో దొరుకుతుంది)
* పిజ్జా సాస్ (ఇది బయట షాపుల్లో దొరుకుతుంది)
* క్యాప్సికం - ఒకటి
* టమోటాలు- రెండు(పెద్దవి)
* ఛీజ్ - 50 గ్రాములు (చిన్న చిన్న ముక్కలుగా చేసినవి)
* ఛీజ్ - 25 గ్రాములు ( సన్నగా తరిగినవి)
* ఉల్లిపాయలు - రెండు
తయారుచేయు విధానం
ముందుగా పిజ్జా బేస్‌ని తీసుకుని దానిపైన పిజ్జా సాస్ వేసి బేస్ అంతటా రాయాలి. దాని మీద ఛీజ్ ముక్కలను అమర్చాలి.
క్యాప్సికం, టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా బేస్ మీద వేయాలి. ఈ రెండు కూరగాయాలు మాత్రమే కాకుండా క్యారెట్ వంటివి కూడా వేయచ్చు.
కూరగాయ ముక్కలపై సన్నగా తరిగిన ఛీజ్‌ను వేయాలి. ఓవెన్‌లో ఏడు నుంచి పది నిమిషాల వరకూ ఉంచాలి. ఓవెన్ లేనివారు పెనం బాగా వేడి చేసి దాని మీద పిజ్జాను ఉంచాలి.
బేస్ బాగా వేడి ఎక్కి- ఛీజ్ కరిగే దాకా ఉంచి తీసి సర్వ్ చేయాలి. ఎటువంటి పరిస్థితులలో పిజ్జాను పెనం మీద తిరగవేయకూడదు.
No comments:
Post a Comment