రష్యన్ సలాడ్ శాండ్‌విచ్ |
తరిగి ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - ముప్పావు కప్పు (క్యారెట్ బీన్స్ పచ్చి బఠాణీ) రెడీమేడ్ మయొనీస్ - అర కప్పు ఫ్రెష్ క్రీమ్ - 2 టే.స్పూన్లు పైనాపిల్ ముక్కలు - అర కప్పు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు -అర కప్పు ఉప్పు - రుచికి సరిపడా బటర్ - 4 టే.స్పూన్లు బ్రెడ్ స్లయిసెస్ - 8 మిరియాల పొడి - 1 టీస్పూను.
మయొనీస్, కూరగాయ ముక్కలు, క్రీమ్, పైనాపిల్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 4 సమభాగాలుగా విడదీసి పెట్టుకోవాలి.
బ్రెడ్ స్లయిసెస్‌కు ఓవైపు బటర్ పూసి సలాడ్ మిశ్రమాన్ని వేసి స్ర్పెడ్ చేయాలి. బటర్ పూసిన మరో బ్రెడ్ స్లయిస్ పైన ఉంచాలి.
ఇలా అన్నీ తయారుచేసుకున్న తర్వాత కత్తితో క్రాస్‌గా కట్ చేసుకోవాలి.టమాటో కెచప్, పొటాటో చిప్స్‌తో సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment