స్టఫింగ్ కోసం తయారుచేసిన పదార్థాలన్నీ కలిపి 8 సమభాగాలుగా విడదీసి పెట్టుకోవాలి.
బటర్ స్లయిసెస్‌కు రెండు వైపులా పూసి పెనం మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ కాల్చుకోవాలి.
ఒక స్లయి్‌సను చదునైన ప్లేట్ మీద ఉంచి స్టఫింగ్ సమంగా పరిచి టోస్ట్ చేసిన మరో స్లయి్‌సను పైన ఉంచాలి. దాని పైన మళ్లీ స్టఫింగ్ పరిచి ఇంకో స్లయి్‌సను పైన ఉంచాలి.
మిగతా స్లయిసె్‌సలతో కూడా ఇలాంటి డబుల్ డెక్కర్ శాండ్‌విచ్‌లు తయారుచేసుకోవాలి. పదునైన కత్తితో శాండ్‌విచ్‌లను క్రాస్‌గా కట్ చేసి సర్వ్ చేయాలి.
గిన్నెలో బంగాళాదుంప, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆమ్‌చూర్ వేసి కలుపుకోవాలి. బ్రెడ్ స్లయిసెస్‌కు ఓవైపు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని పల్చగా పరచాలి. తర్వాత మిశ్రమం పైన బటర్ పూసి పెట్టుకోవాలి.
ఇలా అన్ని స్లయిసెస్ తయారుచేసుకోవాలి. స్కిలెట్ మీడియం హీట్ మీద వేడిచేసి శాండ్‌విచ్‌లను బంగాళాదుంప మిశ్రమం ఉన్నవైపు బోర్లించి 2-3 నిమిషాలు కాల్చుకోవాలి. అంతకంటే తక్కువ సమయంలో స్లయి్‌సను తిరగేస్తే మిశ్రమం బ్రెడ్‌కు అంటుకోకుండా ఊడి వచ్చేస్తుంది.
మిశ్రమం ఉన్న వైపు కాల్చుకున్న తర్వాత తిరగేసి ఒక చీజ్ స్లయిస్ ఉంచి దాని మీద బ్రెడ్ స్లయిస్ కనిపించనంతగా టమాటో స్లయిసెస్ పరచాలి. తర్వాత ఇలాగే కాల్చుకున్న మరో స్లయి్‌సను (మిశ్రమం ఉన్న వైపు) టమాటో స్లయిసెస్ మీద బోర్లించి చీజ్ కరిగేవరకూ రెండువైపులా కాల్చుకోవాలి. తర్వాత క్రాస్‌గా కట్ చేసి కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి.
తరిగి ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - ముప్పావు కప్పు (క్యారెట్ బీన్స్ పచ్చి బఠాణీ) రెడీమేడ్ మయొనీస్ - అర కప్పు ఫ్రెష్ క్రీమ్ - 2 టే.స్పూన్లు పైనాపిల్ ముక్కలు - అర కప్పు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు -అర కప్పు ఉప్పు - రుచికి సరిపడా బటర్ - 4 టే.స్పూన్లు బ్రెడ్ స్లయిసెస్ - 8 మిరియాల పొడి - 1 టీస్పూను.
మయొనీస్, కూరగాయ ముక్కలు, క్రీమ్, పైనాపిల్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 4 సమభాగాలుగా విడదీసి పెట్టుకోవాలి.
బ్రెడ్ స్లయిసెస్‌కు ఓవైపు బటర్ పూసి సలాడ్ మిశ్రమాన్ని వేసి స్ర్పెడ్ చేయాలి. బటర్ పూసిన మరో బ్రెడ్ స్లయిస్ పైన ఉంచాలి.
ఇలా అన్నీ తయారుచేసుకున్న తర్వాత కత్తితో క్రాస్‌గా కట్ చేసుకోవాలి.టమాటో కెచప్, పొటాటో చిప్స్‌తో సర్వ్ చేయాలి.
కీమా - పావుకిలో బ్రెడ్ - ఎనిమిది ముక్కలు ఎండు కారం - రెండు టీ స్పూన్లు కాజు పేస్ట్ - రెండు టీ స్పూన్లు నూనె - రెండు టేబుల్ స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు టమాటాలు - రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి - మూడు కరివేపాకు - ఒక రెబ్బ కొత్తిమీర - ఒక కట్ట షాజీరా - కొద్దిగా గరంమాసాలా - ఒక టీ స్పూను పసుపు - తగినంత ఉప్పు - తగినంత.
కుక్కర్లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత వెల్లుల్లి పేస్టు, షాజీరా కూడా వేయాలి. ఇప్పుడు కీమా వేసి నీరు పోయేంత వరకూ ఉడికించాలి. ఇందులో ఎండుకారం, పసుపు, ఉప్పు, టమోటాలు, కొత్తిమీర, కాజుపేస్ట్ వేసి బాగా కలపాలి.
కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత గరంమసాలా కూడా వేసి దించేయాలి. ఇది చల్లారిన తర్వాత బ్రెడ్‌పై అప్లయి చేసి పైన మరో బ్రెడ్‌తో మూసేయాలి.
దీన్ని పైనంపై కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. గార్నిష్ కోసం క్యారెట్, కీరా, కొత్తమీరతో అలంకరించుకోవాలి.
. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించి పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము కలిపి మరికొంత సేపు ఉంచి దించేముందు పెసర మొలకలు కలిపి దించేయాలి.
బన్స్ లోపల కొంత భాగం తీసేసి, పెనంపై రెండు వైపులా కొద్ది క్షణాలు కాల్చి నేతిబీర మిశ్రమం కూరి ముక్కల మధ్యలో ఆమ్లెట్ పెట్టి బర్గర్ తయారుచేసుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్ ఇది