సోయా, అటుకుల టిక్కీ |
అటుకులు - కప్పు సోయా కీమా - అరకప్పు నూనె - అరకప్పు జీలకర్ర - చెంచా అల్లం తరుగు - రెండు చెంచాలు పచ్చిమిర్చి - మూడు ఉల్లిపాయ - ఒకటి కారం - అరచెంచా పసుపు - పావుచెంచా ఆమ్‌చూర్‌పొడి చాట్‌మసాలా - అరచెంచా చొప్పున ఉప్పు - తగినంత నిమ్మరసం - ఒకటిన్నర చెంచా ఉడికించిన ఆలూ - రెండు మొక్కజొన్నపిండి - రెండు టేబుల్‌స్పూన్లు.
బాణలిని పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాక రెండు చెంచాల నూనె వేసి జీలకర్రా, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అన్నీ వేగాక ఉల్లిపాయముక్కలు వేయాలి.
అవి కూడా కొద్దిగా వేగాక కారం, పసుపూ, ఆమ్‌చూర్‌పొడీ, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. నిమిషం తరవాత అటుకులూ, సోయా కీమా వేసి కాసిని నీళ్లు చల్లుతూ ఉండాలి.
కాసేపటికి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు కొద్దిగా ఉప్పూ, నిమ్మరసం వేయాలి. అన్నీ బాగా కలిశాక ఉడికించిన ఆలూ, మొక్కజొన్న పిండి వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.
ఈ మిశ్రమాన్ని గుండ్రంగా బిళ్లల్లా టిక్కీల్లా చేసుకోవాలి. వీటిని పెనంపై ఉంచి.. నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చి తీసుకోవాలి.
No comments:
Post a Comment