చాక్లెట్ సమోసా |
డార్క్ చాక్లెట్ తురుము- 1 కప్పు మైదా- ఒకటిన్నర కప్పు క్యాస్టర్ షుగర్- 4 టీ స్పూన్లు నెయ్యి- 1 టేబుల్ స్పూను కిస్‌మి్‌సలు- 1 టేబుల్ స్పూను పంచదార పొడి- 3/4 కప్పు నూనె- డీప్ ఫ్రైకి సరిపడా.
మైదాలో నెయ్యి, మూడు టీ స్పూన్ల క్యాస్టర్ షుగర్ వేసి అది బ్రెడ్ తరహాలో పొలుసుగా కనిపించే వరకూ కలుపుతూ ఉండాలి.
తరువాత సరిపడా నీళ్ళుపోసి చపాతీ పిండిలా కలిపి పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత మరో గిన్నెలో చాక్లెట్ తురుము, పంచదార పొడి, స్పూను క్యాస్టర్ షుగర్, కిస్‌మి్‌సలు వేసి బాగా కలపాలి.
ఆ తరువాత మైదాపిండి ముద్దను చిన్న చిన్న ఉండలుచేసి, పలుచగా చపాతీలు ఒత్తి, ఒక్కో చపాతీని రెండుగా మధ్యకు కోయాలి. ఆ తరువాత ఆ ముక్కలను కోను ఆకారంలోకి మడచి, మధ్యలో చాక్లెట్ మిశ్రమం ఉంచి మూసేసి అంచులకు నీటి తడిచేసి విడిపోకుండా అంటించాలి. తరువాత వాటిని నూనెలో దోరగా వేగించి తీయాలి.
No comments:
Post a Comment