కోవా సమోసా |
పచ్చికోవా- 1 కప్పు పంచదార పొడి- 1/2 కప్పు పంచదార- 1 కప్పు నీళ్ళు- 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్- 2 టీ స్పూన్లు నూనె- వేగించడానికి సరిపడా మైదా- 1 కప్పు గోరువెచ్చని నీరు- 1/3 కప్పు ఉప్పు- 1/4 టీ స్పూను యాలకుల పొడి- 1/4 టీ స్పూను.
ఒక గిన్నెలో పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, పచ్చికోవా వేసి బాగా కలిపి ఉంచాలి.
తరువాత మరో గిన్నెలో మైదా, ఉప్పు, గోరువెచ్చని నీరు, టేబుల్ స్పూను నూనె వేసి చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి పావుగంట ఉంచాలి.
ఆ తరువాత సమోసా మాదిరే చేసి మధ్యలో కోవా మిశ్రమాన్ని ఉంచి మూసేసి అంచులకు నీటి తడిచేసి విడిపోకుండా అంటించాలి.
తరువాత వాటిని నూనెలో దోరగా వేగించి తీయాలి. ఆ తరువాత ఒక గిన్నెలో పంచదార, యాలకుల పొడి, నీళ్ళు పోసి తీగపాకం పట్టి సమోసాలు వేసి వాటికి పాకం పట్టించి తీయాలి..
No comments:
Post a Comment