మెంతి లడ్డూ |
మెంతులు: కప్పు పాలు: రెండు కప్పులు గోధుమపిండి: పావుకిలో నెయ్యి: కప్పు బెల్లంతురుము లేదా పంచదార: నాలుగు కప్పులు డ్రైఫ్రూట్స్: కప్పు.
మెంతుల్ని పొడి చేయాలి. తరవాత ఈ పొడిని పాలల్లో వేసి ఓ రాత్రంతా నానబెట్టాలి.
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి నానబెట్టిన మెంతిపిండిని వేసి ఎర్రగా అయ్యేవరకూ వేయించాలి.
విడిగా మరో బాణలిలో నెయ్యి వేసి గోధుమపిండిని వేయించాలి. ఇప్పుడు మెంతిపిండిలో గోధుమపిండి, బెల్లం తురుము, డ్రైఫ్రూట్స్, నెయ్యి కూడా వేసి కలిపి లడ్డూల్లా చుట్టాలి.
No comments:
Post a Comment