VTStyles

Recent Post

Tuesday, 26 July 2016

Breakfast - Steamed - Egg Puttoo / గుడ్డు పుట్టు

గుడ్డు పుట్టు


పుట్టు పొడి - రెండు కప్పులు (బజార్లో దొరుకుతుంది. లేదంటే బియ్యాన్ని రెండుమూడు గంటలు నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లు వంపేసి మెత్తని వస్త్రంపై వేసి తడి ఆరనివ్వాలి. నీరంతా పోయి బియ్యం కాస్త తడిగా ఉన్నప్పుడు మరీ మెత్తగా కాకుండా పిండి పట్టించాలి. చివరగా ఈ పిండిని దోరగా వేయించుకుంటే చాలు) కొబ్బరితురుము - కప్పు ఉప్పు - తగినంత.

మసాలా కోసం

గుడ్లు - నాలుగు ఉల్లిపాయ టొమాటో - ఒక్కోటి చొప్పున అల్లంవెల్లుల్లి తరుగు - అరచెంచా చొప్పున పసుపు - పావుచెంచా కారం - అరచెంచా ధనియాలపొడి - అరచెంచా ఉప్పు - తగినంత మిరియాలపొడి - పావుచెంచా నూనె - రెండు టేబుల్‌స్పూన్లు.

  • ముందుగా గుడ్డు మసాలా తయారు చేసుకోవాలి. గుడ్ల సొనను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో తగినంత ఉప్పూ, మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టాలి.

  • ఓ బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేడిచేసి.. గుడ్లసొన వేయాలి. అది ఉడికాక దింపేసి పెట్టుకోవాలి. మరో బాణలిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనె వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.

  • అవి వేగాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి. తరవాత పసుపూ, కారం, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. నూనె కొద్దిగా పైకి తేలాక టొమాటో ముక్కలు వేయించాలి.

  • ఇది ముద్దలా అయ్యేందుకు కాసిని నీళ్లు పోసి బాగా కలపాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక ముందుగా చేసుకున్న గుడ్డు మిశ్రమం వేసి బాగా కలిపి దింపేయాలి.

  • ఇప్పుడు పుట్టు తయారు చేసుకోవాలి. ఓ గిన్నెలో ఈ పిండిని తీసుకుని, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత ఈ పిండి అంతా తడిసేలా కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇందులో సగం కొబ్బరితురుము వేసి మరోసారి కలిపి పెట్టుకోవాలి.

  • ఒకవేళ ఉండల్లాంటివి ఉంటే ఓసారి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి తడిగా, ఉండేలా చూసుకుంటే చాలు. ఇలా కలిపిన పిండిని పదినిమిషాలు నాననివ్వాలి. తరవాత పుట్టు మౌల్డ్‌ తీసుకుని అందులో మిగిలిన కొబ్బరితురుములో టేబుల్‌స్పూను వేయాలి.

  • తరవాత రెండు టేబుల్‌స్పూన్లు గుడ్డు మసాలా, దానిపైన నాలుగైదు టేబుల్‌స్పూన్లు పుట్టుపిండి వేయాలి. ఇలా ఆ మౌల్డు నిండేవరకూ ఒకదానిమీద మరొకటి వేసుకుంటూ వచ్చి మూత పెట్టేయాలి.

  • ఇప్పుడు చిన్న కుక్కర్‌లో పావు వంతు వరకూ నీళ్లు తీసుకుని మూత పెట్టేయాలి. దీన్ని పొయ్యిమీద ఉంచాలి. పుట్టు మౌల్డును వెయిట్‌ పెట్టే చోట ఉంచి.. ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించి తీస్తే చాలు.

No comments:

Post a Comment