VTStyles

Recent Post

Tuesday, 26 July 2016

Sweets - Halwa - Wheat Flour Halwa / గోధుమ హల్వా

గోధుమ హల్వా


గోధుమ పిండి - అర కప్పు నెయ్యి - ముప్పావు కప్పు బెల్లం తురుము - అర కప్పు నీళ్లు - 2 కప్పులు ఎండు ద్రాక్ష - 10 యాలకుల పొడి - పావు టీ స్పూన్ తరిగిన బాదం గింజలు - 2 టేబుల్ స్పూన్లు పిస్తా ముక్కలు - 1 టేబుల్ స్పూన్

  • ముందుగా స్టౌ ఆన్ చేసి, ప్యాన్ పెట్టాలి. అది కాస్త వేడెక్కాక నెయ్యి వేసి కరిగించాలి. తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్‌ను వేయించాలి.

  • ఇప్పుడు వాటిని తీసేసి, గోధుమ పిండిని వేయించాలి. పచ్చి వాసన పోయే వరకు పిండిని ఫ్రై చేసుకోవాలి.

  • మరోవైపు ఓ గిన్నెలో నీళ్లు, బెల్లం వేసి వేడి చేయాలి. ఆ మిశ్రమం మరుగుతున్నప్పుడు పిండిని అందులో వేస్తూ కలుపుకోవాలి (అలా చేస్తే పిండి ఉండలు కట్టదు).

  • తర్వాత అందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమం దగ్గరికయ్యాక స్టౌ పై నుంచి దింపేయాలి. ఇప్పుడు హల్వాను పిస్తా, బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.

No comments:

Post a Comment