థోరన్
గుడ్లు - ఐదు ఉల్లిపాయ - ఒకటి పచ్చిమిర్చి - మూడు కొబ్బరితురుము - అరకప్పు జీలకర్ర - పావుచెంచా పసుపు - పావుచెంచా మిరియాలపొడి - అరచెంచా కరివేపాకు రెబ్బలు - రెండు ఉప్పు -తగినంత నూనె - పావు కప్పు.
గుడ్లసొనను ఓ గిన్నెలోకి తీసుకుని బాగా గిలకొట్టి పెట్టుకోవాలి. కొబ్బరి తురుములో జీలకర్ర వేసి కలిపి పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక పసుపూ, తగినంత ఉప్పూ, కరివేపాకు రెబ్బలు వేయాలి.
రెండు నిమిషాల తరవాత గిలకొట్టిన గుడ్ల సొన వేసి మంట తగ్గించాలి. కాసేపటికి సొన సగం ఉడుకుతుంది. అప్పుడు జీలకర్ర కలిపిన కొబ్బరితురుము వేయాలి. ఐదు నిమిషాలయ్యాక మిరియాలపొడి వేసి మరోసారి కలిపి దింపేస్తే చాలు.
No comments:
Post a Comment