గసాల హల్వా
గసాలు 100గ్రాములు పాలు రెండు కప్పులు చక్కెర 100గ్రాములు జీడిపప్పు 50గ్రాములు కిస్‌మిస్ 50గ్రాములు నెయ్యి తగినంత
గసాలను ఒక గంటసేపు పాలలో నానపెట్టాలి. నానిన గసాలను మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసి మరిగించాలి.
అందులో నెయ్యి, చక్కెర వేసి కలపాలి. దగ్గరపడే వరకూ ఉడికించాలి. ఉడికిన హల్వాని ఒక గిన్నెలోకి తీసుకుని జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.
No comments:
Post a Comment