VTStyles

Recent Post

Friday, 29 July 2016

Drinks - Panacotta - Salted Caramel Panacotta / సాల్టెడ్‌ కారమిల్‌ పన్నాకోట

సాల్టెడ్‌ కారమిల్‌ పన్నాకోట


క్రీం- ముప్పావుకప్పు పాలు-అరకప్పు చక్కెర- అరకప్పు వెనిల్లా ఎసెన్స్‌- టేబుల్‌ స్పూను జిలాటిన్‌- రెండు చెంచాలు ఉప్పు- చిటికెడు

టాపింగ్‌ కోసం

చక్కెర- పావుకప్పు డ్రైఫ్రూట్స్‌- అరకప్పు(జీడిపప్పు వాల్‌నట్లు బాదం వంటివి)

  • ముందుగా గ్లాసు వేణ్నీళ్లలో జిలాటిన్‌ కలిపి పెట్టుకోవాలి. తరవాత ఒక గిన్నెలోకి పాలూ, క్రీం, వెనిల్లా ఎసెన్స్‌ తీసుకుని ఓవెన్‌లో నలభై సెకన్లు ఉంచాలి. ఒకసారి బయటకు తీసి బాగా కలిపి మళ్లీ ఓ ముప్ఫై సెకన్లు ఓవెన్‌లో ఉంచాలి.

  • ఇప్పుడు ఒక మందపాటి పాన్‌లో టేబుల్‌ స్పూను నీళ్లు తీసుకుని అందులో చక్కెర వేసి పొయ్యిమీద పెట్టాలి. కాసేపటికి చక్కెర కరిగి పాకంగా మారి ముదురు రంగులోకి వచ్చేస్తుందీ మిశ్రమం.

  • అందులో ముందుగా ఓవెన్‌లో వేడిచేసిన క్రీం మిశ్రమాన్ని కలపాలి. కాసేపయ్యాక జిలాటిన్‌ మిశ్రమం, ఉప్పు వేసి పొయ్యి కట్టేయాలి. తరవాత దీన్ని మూసలోకి తీసుకుని నాలుగు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • ఈ మిశ్రమం గట్టిపడేలోగా టాపింగ్‌తయారుచేసుకోవాలి. టేబుల్‌ స్పూను నీటిలో చక్కెర కలిపి పాకం వచ్చేవరకూ పొయ్యి మీద ఉంచాలి. తరవాత డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి బాగా కలిపి దింపేయాలి. మూసలో వేసిన మిశ్రమం గట్టిగా అయ్యాక ఈ టాపింగ్‌పై వాటిపై వేసి అలంకరిస్తే చాలు.

No comments:

Post a Comment