VTStyles

Recent Post

Friday, 29 July 2016

Drinks - Smoothie - Carrot Coconut Soup / క్యారెట్‌,కొబ్బరి సూప్‌

క్యారెట్‌,కొబ్బరి సూప్‌


ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూన్లు ఉల్లిపాయ - ఒకటి(తరుగు) క్యారెట్లు - ఎనిమిది (తొక్క తీయొద్దు. చిన్న ముక్కలుగా తరగాలి) ఉడికించిన కూరగాయల నీళ్లు - మూడున్నర కప్పులు కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు అల్లం తరుగు - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ కూర పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌ ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్‌ ఉప్పు మిరియాలు - రుచికి సరిపడా.

  • ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఆలివ్‌ నూనె వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయలు వేసి సన్నటి సెగ మీద ఏడు నిమిషాల పాటు వేగించాలి.

  • తరువాత క్యారెట్‌ ముక్కలు వేసి ఐదు నిమిషాల తరువాత ఉడికించిన కూరగాయల నీళ్లు, కొబ్బరి పాలు పోయాలి. అల్లం, కూర పొడి వేసి మూత పెట్టి క్యారెట్‌ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి.

  • ఇందుకు పావుగంట పడుతుంది. ఈ మిశ్రమం చల్లారిన తరువాత బ్లెండర్‌ జార్‌లో వేసి తిప్పాలి. ఉప్పు, మిర్చి తునకలు చల్లుకుని కొత్తిమీరతో అలంకరించుకుని తాగితే హాయిగా ఉంటుంది.

No comments:

Post a Comment