మష్రూమ్ కట్‌లెట్
సన్నగా తరిగిన మష్రూమ్స్ - రెండున్నర కప్పులు ఉడికించిన బంగాళాదుంప (చిదుముకోవాలి) - 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్ పసుపు - పావు టీ స్పూన్ కారంపొడి - అర టీ స్పూన్ జీలకర్ర పొడి - అర టీ స్పూన్ ఉప్పు - తగినంత శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు - పావు కప్పు ఉప్మా రవ్వ - ఒకటిన్నర కప్పు నూనె - సరిపడా
స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోసి, వేడెక్కాక ఉల్లిపాయలు వేయాలి. ఆపైన అల్లం- వెల్లుల్లి పేస్ట్, తరిగిన మష్రూమ్స్ వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత శనగపిండి వేసి స్టౌను చిన్న మంటపై పెట్టి దింపేయాలి.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిదిమిన బంగాళాదుంపతో కలపాలి. ఆపైన కొత్తిమీర తరుగును వేసి కలిపి, కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని గుండ్రంగా ఒత్తి ఉప్మా రవ్వలో ముంచాలి.
ఇప్పుడు వాటిని పెనంపై నూనె చుక్కలు వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. (డీప్‌ఫ్రై కూడా చేసుకోవచ్చు)
No comments:
Post a Comment