బీట్‌రూట్ పట్టి
బీట్‌రూట్ (పెద్దది) - 1 బంగాళాదుంప (పెద్దది) - 1 పసుపు - పావు టీ స్పూన్ కారం పొడి - అర టీ స్పూన్ మసాలా పొడి - అర టీ స్పూన్ ధనియాల పొడి - 1 టీ స్పూన్ నిమ్మరసం - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంత బ్రెడ్ ముక్కల పొడి - 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ - అర కప్పు నూనె - సరిపడా
ముందుగా బీట్‌రూట్, బంగాళాదుంపలను ఉడికించి, చిదుముకోవాలి.
ఇప్పుడు ఓ బౌల్‌లో ఆ రెండింటి మిశ్రమం, కారం, ఉప్పు, మసాలా, ధనియాల సొడి, పసుపు, నిమ్మరసం, బ్రెడ్ ముక్కల పొడి వేసి కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే.. కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని ఒత్తుకోవాలి. వాటిని ఉప్మా రవ్వలో నుంచి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా పెనంపై కొద్దిగా నూనె వేసి ఇరువైపులా కాల్చు కోవచ్చు. వీటిని మెంతి మొలకలతో గార్నిష్ చేసుకోవాలి.
No comments:
Post a Comment