VTStyles

Recent Post

Thursday, 28 July 2016

Soup - Basella Alba Soup / బచ్చలికూర సూప్‌

బచ్చలికూర సూప్‌


నాలుగు వందల గ్రాములు తరిగిన బచ్చలికూర ఒక తరిగిన ఉల్లిపాయ రెండు వెల్లుల్లి రెబ్బలు దాల్చిన చెక్క ఒకటి తరిగిన పచ్చి మిరపకాయలు రెండు బిరియానీ ఆకులు రెండు కొన్ని మిరియాలు రెండు టీస్పూన్ల చొప్పున నూనె మీగడ ఉడికించి తరిగిన చిన్న బంగాళాదుంప తగినంత ఉప్పు.

  • మొదట బచ్చలికూరను శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఒక గిన్నెలో నూనె పోసి వెల్లుల్లి రెబ్బలు, బిరియానీ ఆకులు, దాల్చిన చెక్క, మిరియాలు, పచ్చి మిరపకాయ ముక్కలు, బచ్చలికూర వేసి బాగా కలపాలి.

  • బంగాళాదుంప ముక్కలు, కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. బిరియానీ ఆకులు తీసేసి ఆ గుజ్జులాంటి మిశ్రమంలో కొద్దిగా నీరు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.

  • కొద్దిసేపటి తరువాత మీగడ వేసి మళ్లీ కొద్దిసేపు ఉడకనిచ్చి సర్వ్‌ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది.

No comments:

Post a Comment