క్యారెట్ బెల్ పెప్పర్ సూప్
క్యారెట్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ టొమాటో- అరకప్పు చొప్పున ఎండుమిర్చిగింజలు లవంగాలు యాలకలు- అరటీస్పూను చొప్పున మిరియాలు- పావుటీస్పూను. ఉప్పు- తగినంత.
ఒక గిన్నెలో క్యారెట్, క్యాప్సికం, టొమాటోలు ముక్కలు వేసి రెండు కప్పులు నీళ్లు పోసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
స్టవ్ ఆపేసాక ముక్కల్ని మెత్తగా మెదపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసుకొని ఎండుమిర్చి గింజలు, లంవంగాలు, యాలకలు, ఉప్పు, మిరియాలు వేసి పావు కప్పు నీళ్లు పోసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్నమంటపై రెండు నిమిషాలపాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
No comments:
Post a Comment