మామిడి కొబ్బరి చక్రాలు
కొబ్బరి మామిడి లేదా దోర బంగినపల్లి తురుము- 1 కప్పు నానబెట్టి పొట్టు తీసిన బాదం- 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము- 1 కప్పు బెల్లం తురుము ఎండు కొబ్బరి తురుము- ఒక్కోటి 1 టేబుల్ స్పూను చొప్పున బియ్యప్పిండి- 2 టేబుల్ స్పూన్లు నెయ్యి- 1 టీ స్పూను.
బాదం పప్పును మెత్తగా రుబ్బుకుని దానిలో మామిడి తురుము, పచ్చికొబ్బరి తురుము, బెల్లం, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.
తరువాత దానిని ఆవిరిమీద ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. మిశ్రమం చల్లారాక మరోసారి బాగా కలిపి, దానిని బారుగా లావుపాటి కర్ర మాదిరిగా చేసుకోవాలి.
తరువాత దానికి నెయ్యి రాసి ఎండు కొబ్బరిలో దొర్లించాలి. ఆ తరువాత మిశ్రమాన్ని రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచి ముక్కలు కోయాలి.
No comments:
Post a Comment