ఫ్రూట్ గప్ చుప్ డ్రింక్ షాట్స్ |
బూందీ: 50 గ్రా. సెనగలు: 100 గ్రా. బంగాళాదుంప: ఒకటి పానీ పూరీలు: 20 కారం: టీస్పూను పచ్చిమిర్చి: ఒకటి చాట్‌మసాలా: టీస్పూను ఫ్రూట్ జ్యూస్(పైనాపిల్ జామ నారింజ... ఏదైనా): 150 మి.లీ.
సెనగల్ని రాత్రికే నానబెట్టాలి. బంగాళాదుంప ముక్కల్నీ సెనగల్నీ ఉడికించి, మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా కలపాలి.
పండ్లరసంలో ఉప్పు, కారం, చాట్‌మసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఈ జ్యూస్‌ని కొద్దికొద్దిగా షాట్ గ్లాసెస్‌లో పోయాలి.
ఇప్పుడు పానీపూరీలకు మధ్యలో చిల్లుపెట్టి అందులో ఉడికించిన బంగాళాదుంప, సెనగల కూర పెట్టి, ఆపైన కాస్త బూందీ చల్లి దాన్ని ఆ గ్లాసుమీద పెట్టి పుదీనా తురుముతో అలంకరించాలి.
ఇప్పుడు గప్‌చుప్‌ని నోట్లో పెట్టేసుకుని ఆ డ్రింక్‌ని చప్పరించేస్తే సరి.
No comments:
Post a Comment