
లాచా పరాటా
గోధుమపిండి - రెండు కప్పులు నెయ్యి - సరిపడా ఉప్పు - రుచికి సరిపడ నూనె - టేబుల్ స్పూన్.
ముందుగా గోధుమపిండిలో ఉప్పు, నూనె, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చేసి తడిబట్ట కప్పి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి.
తరువాత పిండిని ఉండలుగా చేసి ఐదారు అంగుళాల చపాతీలు చేయాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని చపాతీ మీద మొత్తంగా రాయాలి.
తరువాత చాకుతో రెండున్నర అంగుళాల వెడల్పుతో పొడవుగా కోయాలి. వీటన్నింటినీ ఒకదాని మీద ఒకటి పరచాలి. అలా పరిచేటప్పుడు ప్రతీ దానిమీద నెయ్యి రాయాలి.
ఇలా పరిచిన దానిని ఒకవైపు నుండి గుండ్రంగా చుట్టాలి. ఇప్పుడు దీన్ని కర్రతో పరాటాల్లా వత్తాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వెన్న వేస్తూ తక్కువ మంటతో రెండువైపులా కాల్చి తీయాలి. అంతే, లాచా పరాటా రెడీ.
No comments:
Post a Comment