VTStyles

Recent Post

Thursday, 11 August 2016

Roti - Paneer Kulcha / పన్నీర్‌ కుల్చా

పన్నీర్‌ కుల్చా


మైదా - రెండు కప్పులు పాలు - అరకప్పు పెరుగు - పావుకప్పు పంచదార - అర టీ స్పూను బేకింగ్‌ పౌడర్‌ - ముప్పావు టీ స్పూన నువ్వులు - మూడు టీ స్పూన్లు నెయ్యి - రెండు స్పూన్లు తురిమిన పన్నీర్‌ - పావుకప్పు ఉల్లిగడ్డ - ఒకటి పచ్చిమిరపకాయలు - రెండు చాట్‌మసాలా - ఒక టీ స్పూన కారం - ఒక టీ స్పూన ఉప్పు - తగినంత.

  • పాలు వేడిచేసి చల్లార్చుకోవాలి. మైదాలో బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో పంచదార, చల్లని పాలు, పెరుగు వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీనిపై ఒక మెత్తని వస్త్రం కప్పి రెండుగంటలపాటు పక్కన పెట్టాలి.

  • . ఈలోపు పచ్చిమిరపకాయలను, ఉల్లిగడ్డను చిన్నగా కట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో పన్నీర్‌, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి.

  • ఇప్పుడు మైదాను తీసుకొని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి. దీంట్లో పన్నీరు మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ చిన్న ముద్దలా చేయాలి.

  • మళ్ళీ కొద్దిగా పిండి, నువ్వులు వేస్తూ చపాతీల్లా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

  • తర్వాత పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేస్తూ సన్నని మంట మీద రెండువైపులా కాల్చుకోవాలి. వేడి వేడి పన్నీర్‌ కుల్చా రెడీ! వీటిని బఠాణీలతో చేసిన ఏ కూరతోనైనా లాగించేయొచ్చు.

No comments:

Post a Comment