VTStyles

Recent Post

Tuesday, 2 August 2016

Starters - NonVeg - Patrani Macchi / పత్రాని మచ్చీ

పత్రాని మచ్చీ


చేప ముక్కలు - పావుకేజీ కొబ్బరి ముక్కలు - అర కప్పు కొత్తిమీర - రెండు కట్టలు ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - నాలుగు జీలకర్ర - రెండు చెంచాలు వెల్లుల్లి ముక్కలు - టేబుల్‌స్పూను నిమ్మరసం - నాలుగు చెంచాలు అరటి ఆకులు - రెండు నూనె - కొద్దిగా.

  • ముందుగా కొబ్బరిముక్కలూ, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిముక్కలూ, నిమ్మరసం, తగినంత ఉప్పూ మిక్సీ జారులో వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి.

  • పావుగంట అయ్యాక అరటి ఆకులకు నూనె రాసి.. చేపముక్కల్ని ఒక్కోటి చొప్పున ఉంచి.. అంచులు మూసి పొట్లంలా చుట్టేయాలి.

  • ఈ పొట్లాలను ఆవిరిపై ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించి తీసుకోవాలి. లేదంటే పెనంపై ఉంచి.. రెండువైపులా నూనె వేసుకుంటూ కాల్చినా సరిపోతుంది.

No comments:

Post a Comment