
పత్రాని మచ్చీ
చేప ముక్కలు - పావుకేజీ కొబ్బరి ముక్కలు - అర కప్పు కొత్తిమీర - రెండు కట్టలు ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - నాలుగు జీలకర్ర - రెండు చెంచాలు వెల్లుల్లి ముక్కలు - టేబుల్‌స్పూను నిమ్మరసం - నాలుగు చెంచాలు అరటి ఆకులు - రెండు నూనె - కొద్దిగా.
ముందుగా కొబ్బరిముక్కలూ, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిముక్కలూ, నిమ్మరసం, తగినంత ఉప్పూ మిక్సీ జారులో వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి.
పావుగంట అయ్యాక అరటి ఆకులకు నూనె రాసి.. చేపముక్కల్ని ఒక్కోటి చొప్పున ఉంచి.. అంచులు మూసి పొట్లంలా చుట్టేయాలి.
ఈ పొట్లాలను ఆవిరిపై ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించి తీసుకోవాలి. లేదంటే పెనంపై ఉంచి.. రెండువైపులా నూనె వేసుకుంటూ కాల్చినా సరిపోతుంది.