VTStyles

Recent Post

Showing posts with label ఫ్రూట్‌ గప్‌ చుప్‌ డ్రింక్‌ షాట్స్‌. Show all posts
Showing posts with label ఫ్రూట్‌ గప్‌ చుప్‌ డ్రింక్‌ షాట్స్‌. Show all posts

Thursday, 28 July 2016

Snacks - Chats - Fruit Gup Chup Drink Shots /ఫ్రూట్‌ గప్‌ చుప్‌ డ్రింక్‌ షాట్స్‌

ఫ్రూట్‌ గప్‌ చుప్‌ డ్రింక్‌ షాట్స్‌


బూందీ: 50 గ్రా. సెనగలు: 100 గ్రా. బంగాళాదుంప: ఒకటి పానీ పూరీలు: 20 కారం: టీస్పూను పచ్చిమిర్చి: ఒకటి చాట్‌మసాలా: టీస్పూను ఫ్రూట్‌ జ్యూస్‌(పైనాపిల్‌ జామ నారింజ... ఏదైనా): 150 మి.లీ.

  • సెనగల్ని రాత్రికే నానబెట్టాలి. బంగాళాదుంప ముక్కల్నీ సెనగల్నీ ఉడికించి, మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా కలపాలి.

  • పండ్లరసంలో ఉప్పు, కారం, చాట్‌మసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఈ జ్యూస్‌ని కొద్దికొద్దిగా షాట్‌ గ్లాసెస్‌లో పోయాలి.

  • ఇప్పుడు పానీపూరీలకు మధ్యలో చిల్లుపెట్టి అందులో ఉడికించిన బంగాళాదుంప, సెనగల కూర పెట్టి, ఆపైన కాస్త బూందీ చల్లి దాన్ని ఆ గ్లాసుమీద పెట్టి పుదీనా తురుముతో అలంకరించాలి.

  • ఇప్పుడు గప్‌చుప్‌ని నోట్లో పెట్టేసుకుని ఆ డ్రింక్‌ని చప్పరించేస్తే సరి.