VTStyles

Recent Post

Showing posts with label Continental - Rolls - Banana Bite Dogs /బనానా డాగ్ బైట్స్. Show all posts
Showing posts with label Continental - Rolls - Banana Bite Dogs /బనానా డాగ్ బైట్స్. Show all posts

Monday, 27 June 2016

Continental - Rolls - Banana Bite Dogs /బనానా డాగ్ బైట్స్

బనానా డాగ్ బైట్స్


అరటిపండు - 2 పీనట్ బటర్ - పావుకప్పు చపాతీలు - 2 తేనె - 1 టీ స్పూన్

  • ముందుగా అరటిపండ్ల తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలకు ముందుగా తేనెను సమానంగా రాయాలి. ఆపైన పీనట్ బటర్‌ను అప్లై చేయాలి.

  • ఇప్పుడు ఒక్కో చపాతీలో ఒక్కో అరటిపండును పెట్టి రోల్ చేయాలి. తర్వాత ఒకటిన్నర ఇంచు చొప్పున రోల్‌ను కట్ చేసుకోవాలి.

  • కావాలంటే చపాతీలకు బదులు టార్టిల్లాలను వాడొచ్చు. ఇవి షాపుల్లో దొరుకుతాయి. అలాగే పీనట్ బటర్‌ను కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే.. ముందుగా పల్లీలను వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి. ఆపైన అందులో చిటికెడు ఉప్పు, తేనె, కొద్దిగా పల్లి నూనె వేసి మరోసారి క్రీమ్‌లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి