![]() |
మరి కొన్ని పిజ్జా రుచులు |
కావలసిన పదార్థాలు
క్యాప్సికం(తరిగి)* టొమాటో(తరిగి)
* ఉల్లిపాయ(తరిగి)- ఒక్కోటి చొప్పున
* వెల్లుల్లి(తరిగి)
* నూనె లేదా వెన్న
* ఉప్పు- ఒక్కో టీస్పూను చొప్పున
* పచ్చిమిర్చి(తరిగి)- రెండు
* మిరియాల పొడి- అరటీస్పూను
* చీజ్- పావుకప్పు
* బ్రెడ్ ముక్కలు- నాలుగు.
తయారుచేయు విధానం
క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాలపొడిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
తరువాత చీజ్, నూనె లేదా వెన్న వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలపై పెట్టాలి.
దీని మీద మరికొద్దిగా చీజ్ వేసి పైన బ్రెడ్ ముక్క పెట్టాలి. పాన్‌పై కొద్దిగా నూనె వేసి ఈ శాండ్ విచ్‌లను ఒక నిమిషంపాటు వేడి చేస్తే సరి.
చవులూరించే క్యాప్సికం టొమాటో చీజ్ శాండ్‌విచ్ రెడీ అవుతుంది. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
No comments:
Post a Comment