![]() |
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
* గోధుమరవ్వ - ఒకటిన్నర కప్పు
* పెసరపప్పు - అరకప్పు
* (వేడి నీటిలో పావుగంట నానిన) మీల్‌మేకర్ - అరకప్పు
* నెయ్యి - 1 టేబుల్ స్పూను
* అల్లం తరుగు - అర టేబుల్ స్పూను
* జీలకర్ర - 1 టీ స్పూను
* పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను
* చిన్న మెంతి తరుగు - 1 టేబుల్ స్పూను
* గరం మసాలా - 1 టీ స్పూను
* ఉప్పు - రుచికి తగినంత
* కరివేపాకు - 4 రెబ్బలు
* నీరు - నాలుగున్నర కప్పులు.
తయారుచేయు విధానం
గోధుమరవ్వ, పెసరపప్పులను పావుగంట నానబెట్టుకోవాలి.
కడాయిలో నెయ్యి వేసి జీలకర్ర, అల్లం, మెంతి తరుగు, మీల్ మేకర్, కరివేపాకు, పచ్చిమిర్చి వేగాక, రవ్వ పెసరపప్పు కూడా వేసి కాసేపు వేగించాలి.
తర్వాత నీరు, ఉప్పు, గరం మసాలా కలిపి మూతపెట్టాలి. నీరంతా ఇగిరిపోయాక మంట బాగా తగ్గించి ఉప్మాని మగ్గనివ్వాలి.
వేడివేడిగా టమేటో చెట్నీ/ పల్లీ చెట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment