![]() |
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
*ఓట్స్: కప్పు
* ఉల్లిపాయ: ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి)
* పచ్చిమిరపకాయలు: రెండు లేదా మూడు(ముక్కలుగా చేసుకోవాలి)
* పచ్చిశనగపప్పు
* ఆవాలు
* జీలకర్ర: టేబుల్ స్పూను చొప్పున
* అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్ స్పూను
* పసుపు: చిటికెడు
* నిమ్మరసం: కొద్దిగా
* ఉప్పు: తగినంత
* నూనె: తగినంత
* కరివేపాకు
* కొత్తిమీర కొద్దిగా.
తయారుచేయు విధానం
ముందుగా ఓట్స్‌ను నూనె లేకుండా కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బాండీలో నూనె పోసి పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇవివేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర కూడా జతచేయాలి.
ఈలోపు వేరే గిన్నెలో రెండున్నర కప్పుల నీరు పోసి మరిగించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేగిన తరువాత ఓట్స్, ఉప్పు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి మరిగించి పెట్టుకున్న నీరు పోసి సన్నని మంట మీద ఉడికించాలి.
దించే ముందు నిమ్మరసం చల్లుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment