![]() |
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
*సగ్గుబియ్యం - 3 కప్పులు
* వేరుశనగపొడి - 1 కప్పు
* పచ్చిమిర్చి - 4
* పచ్చికొబ్బరి తురుము - 2 స్పూన్లు
* ఆవాలు
* జీలకర్ర - చెరో స్పూను
* నిమ్మరసం - అర స్పూను
* నూనె
* ఉప్పు - తగినంత
* కరివేపాకు - 1 రెమ్మ
* నీళ్లు - తగినన్ని
తయారుచేయు విధానం
సగ్గుబియ్యం గంటపాటు నీళ్లలో నానబెట్టాలి. బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తర్వాత సగ్గుబియ్యం, వేరుశనగ పొడి, ఉప్పు వేయాలి. కొద్దిగా ఉడికాక తగినన్ని నీళ్లు పోసి చిన్నమంట మీద దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. చివర్లో కొబ్బరి, నిమ్మరసం వేసి కలిపి దింపేయాలి.
No comments:
Post a Comment