![]() |
మరి కొన్ని ఐస్‌క్రీం రుచులు |
కావలసిన పదార్థాలు
*మామిడి గుజ్జు- ఒకటిన్నర కప్పు
* నీళ్ళు- అరలీటరు
* పంచదార- 1 కప్పు
* అగార్ అగార్ (చైనా గ్రాస్)- 10 గ్రాములు.
తయారుచేయు విధానం
అగార్ అగార్‌ను నీళ్ళలో వేసి పావుగంట నానబెట్టాలి. తరువాత నీళ్ళలో పూర్తిగా కరిగే వరకూ సన్నని మంటమీద ఉడికించాలి.
తరువాత పంచదార వేసి అది కరిగిన తర్వాత మామిడి గుజ్జు వేసి బాగా కలిపి మంట కట్టేయాలి.
ఈ మిశ్రమాన్ని వెంటనే ఐస్‌ఫ్రూట్ మౌల్డ్‌లలో పోసి రెండుగంటలు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి.
తరువాత మౌల్డ్‌లను బయటకు తీసి ఒకసారి పంపుకింద ఉంచి తీశాకే ఐస్‌ఫ్రూట్‌ను మౌల్డ్ నుంచి బయటకు తియ్యాలి.
No comments:
Post a Comment