![]() |
మరి కొన్ని రైతా రుచులు |
కావలసిన పదార్థాలు
* పెరుగు - 200 గ్రా
* కొబ్బరి తురుము - 100 గ్రా
* ఉప్పు - తగినంత
* పచ్చి శనగపప్పు - 10 గ్రా
* మినప్పప్పు - 10 గ్రా
* ఆవాలు - టీస్పూను
* కరివేపాకు - రెండు రెమ్మలు
* చింతచిగురు - 20 గ్రా
* మిరప్పొడి - 10 గ్రా
* ఎండుమిర్చి - 5గ్రా
* నూనె - టీ స్పూన్.
తయారుచేయు విధానం
పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుము కలపాలి.
బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మిన ప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేగిన తరువాత చివరగా చింతచిగురు, మిరప్పొడి వేయాలి.
చింతచిగురు మెత్తబడ్డాక దించేసి, పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే, పెరుగు పచ్చడి రెడీ!
No comments:
Post a Comment