![]() |
మరి కొన్ని బజ్జీలు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* బేబీ కార్న్ - 10
* కార్న్‌ఫ్లోర్ - 5 టేబుల్ స్పూన్లు
* మైదా - 5 టేబుల్ స్పూన్లు
* పచ్చిమిర్చి - 4
* వెల్లుల్లి రేకలు - 6
* అల్లం - అంగుళం ముక్క
* కొత్తిమీర తరుగు - అరకప్పు
* ఉప్పు - రుచికి సరిపడా
* నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేయు విధానం
వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను మెత్తగా గ్రైండ్ చేసుకొని, బేబీ కార్న్‌లను నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాత్రలో మిర్చి పేస్టు, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా, కొత్తిమీర తరుగు వేసి తగినంత నీరు పోస్తూ జారుగా కలుపుకోవాలి.
కడాయిలో నూనె వేడయ్యాక బేబీ కార్న్‌లను ఆ జారులో ముంచి మిర్చీ బజ్జీల్లా వేసుకొని దోరగా వేగించుకోవాలి. వేడివేడి బీబీ కార్న్ బజ్జీలు టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment