![]() |
మరి కొన్ని బజ్జీలు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*బ్రెడ్ ముక్కలు - పది
* శెనగపిండి - పావుకిలో
* డాల్డా - 50 గ్రాములు
* తినే సోడా - చిటికెడు
* ఉడికించిన బఠానీలు - అర కప్పు
* మరమరాలు - అర కప్పు
* ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
* బజ్జీ మసాలా - రెండు టీ స్పూన్లు
* నూనె - సరిపడా
* ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం
చిన్న సైజు బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో శెనగపిండి వేసి తగినంత ఉప్పు, తినే సోడా వేసి జారుగా కలుపుకోవాలి.
స్టౌ మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక బ్రెడ్‌ని పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసి పేపర్‌పై వేయాలి.
బజ్జీ మధ్యలో కట్ చేసి డాల్డా రాసి బజ్జీ మసాల, ఉప్పు వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బఠానీలు, మరమరాలు వేసి అలంకరించాలి.
No comments:
Post a Comment