![]() టూటీఫ్రూటీ కప్‌కేక్ |
మరి కొన్ని కేక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*వెన్న - 150 గ్రా
* గుడ్లు - నాలుగు
* మైదా - ముప్పావు గ్లాసు
* చక్కెర - గ్లాసు
* టూటీఫ్రూటీ
* చెర్రీ ముక్కలు - రెండూ కలిపి పావు కప్పు
* యాలకులపొడి - చెంచా
* వెనిల్లా ఎసెన్స్ - చెంచా
* బేకింగ్‌పౌడర్ - అరచెంచా.
తయారుచేయు విధానం
ఓ గిన్నెలో వెన్నా, చక్కెరా తీసుకుని బాగా గిలకొట్టాలి. తరవాత అందులో గుడ్ల సొన కూడా వేసి మరోసారి గిలకొట్టాలి. ఇప్పుడు మైదా, బేకింగ్‌పౌడర్, యాలకులపొడీ, వెనిల్లా ఎసెన్స్ వేసుకుని మెత్తని మిశ్రమం అయ్యేలా కలపాలి.
ఇందులో టూటీఫ్రూటీ, చెర్రీ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. కాగితం కప్పులకు కొద్దిగా వెన్న రాసి ఈ మిశ్రమాన్ని వాటిల్లో ముప్పావు వంతు వరకూ నింపి అరగంటపాటు బేక్‌చేయాలి. అంతే.. నోరూరించే కప్‌కేక్‌లు సిద్ధం.
No comments:
Post a Comment