ఆరెంజ్ మఫిన్స్ |
కమలాకాయ: ఒకటి కమలాపండురసం: అరకప్పు గుడ్డు: ఒకటి మైదా: ఒకటిముప్పావు కప్పులు పంచదార: పావుకప్పు బేకింగ్ పౌడర్: టీస్పూను
కమలాకాయని నాలుగు భాగాలుగా కోసి తొక్కనీ గింజల్నీ తీసేయాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి మెత్తని గుజ్జులా చేయాలి.
ఓ గిన్నెలో గుడ్డుసొన, వెన్న, పంచదార వేసి గిలకొట్టాలి. విడిగా మరో గిన్నెలో మైదా, బేకింగ్‌పౌడర్ వేసి కలిపాక ఈ మిశ్రమాన్ని గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఇందులోకి కమలాగుజ్జు వేసి బాగా కలిపాక, ఈ మిశ్రమాన్ని మఫిన్ కప్పుల్లో ముప్పావు వంతు వచ్చేవరకూ పోయాలి.
ఇప్పుడు ఈ కప్పులు ఓవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర 20 నిమిషాలపాటు బేక్ చేయాలి. టూత్‌పిక్‌తో గుచ్చి చూసి బేక్ అయ్యాయి అనుకుంటే తీసి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి.
No comments:
Post a Comment