కొబ్బరి బిస్కెట్లు |
కొబ్బరితురుము - రెండు కప్పులు చక్కెరపొడి - రెండు కప్పులు పాలు - కప్పు వెన్న - నాలుగుటేబుల్‌స్పూన్లు జీడిపప్పుపొడి - టేబుల్‌స్పూను గులాబీ ఎసెన్సు - అరచెంచా.
బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల వెన్న, కొబ్బరితురుము, చక్కెరపొడి, పాలు, జీడిపప్పు పొడి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి.
చక్కెర కరిగి మిశ్రమం దగ్గరపడేవరకూ ఉంచాలి. ఆ తరవాత మిగిలిన వెన్న, గులాబీ ఎసెన్సు వేసి మరోసారి కలపాలి.
రెండుమూడు నిమిషాలయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక బిస్కెట్ల్లలా కోసుకుంటే సరిపోతుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి బిస్కెట్లు సిద్ధం.
No comments:
Post a Comment