పీనట్ బటర్ కుకీస్ |
పీనట్(వేరుసెనగ)బటర్: ముప్పావుకప్పు వెన్న: అరకప్పు పంచదార: 65గ్రా. బ్రౌన్‌షుగర్: 65 గ్రా. గుడ్డు: ఒకటి పాలు: 2 టేబుల్‌స్పూన్లు వెనీలా ఎసెన్స్: టీస్పూను మైదా: ఒకటిన్నర కప్పు బేకింగ్‌సోడా: టీస్పూను ఉప్పు: చిటికెడు చాక్లెట్స్: 40
ఓవెన్‌ను 180 డిగ్రీలకు వేడిచేయాలి. బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పరచాలి.
గిన్నెలో మైదా, బేకింగ్‌సోడా, ఉప్పు వేసి కలపాలి. మరో గిన్నెలో వెన్న, పీనట్ బటర్ వేసి బీటర్‌తో గిలకొట్టాలి. రెండు రకాల పంచదారలూ వేసి కరిగాక గుడ్డు, వెనీలా ఎసెన్స్, పాలు వేసి రెండు నిమిషాలు గిలకొట్టాక మైదా మిశ్రమాన్ని కూడా వేసి గిలకొడితే చపాతీ పిండిలా అవుతుంది.
ఓ ప్లేటులో రెండుమూడు స్పూన్ల పంచదార వేయాలి. మిశ్రమాన్ని చిన్న గోలీల్లా చేసి పంచదారలో దొర్లించి బేకింగ్ ట్రేలో కాస్త ఎడంఎడంగా పెట్టి, పదినిమిషాలు బేక్ చేయాలి (బాల్స్‌లా చేసినా కుకీస్‌లానే వస్తాయి. ముందే ప్రెస్ చేయకూడదు). తీశాక వాటిమధ్యలో చాక్లెట్ పెట్టాలి.
No comments:
Post a Comment